సైనికుని స్థాయి నుంచి సార్వభౌమునిగా.. జానుపూర్ ప్రభువు జమాల్ ఖాన్ కుమారుడు హసన్ ఖాన్

సైనికుని స్థాయి నుంచి సార్వభౌమునిగా.. జానుపూర్ ప్రభువు జమాల్ ఖాన్ కుమారుడు హసన్ ఖాన్

జానుపూర్ ప్రభువైన జమాల్​ ఖాన్ – ఇబ్రహీం కొడుకు హసన్‌ఖాన్​ను తన సేవలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత అతనికి బిహార్​లోని రెండు జిల్లాలను 500 గుర్రాల పోషణార్థం ధారాదత్తం చేశాడు. హసన్​ ఖాన్​కు ఎనిమిది మంది కొడుకులు. వారిలో ఫరీద్​ ఖాన్, నిజాం ఖాన్​లు మాత్రమే భార్యకు పుట్టినవాళ్లు. అయితే హసన్ భార్యను నిర్లక్ష్యం చేయడంతో ఆమె కొడుకు ఫరీద్​ ఇల్లు విడిచి వెళ్లిపోయి జానుపూర్​ ప్రభువు జమాల్ ఖాన్​ దగ్గర సైనికుడిగా చేరాడు.

 తన కొడుకు చదువుకోవాలని వెంటనే తిరిగి పంపమని తండ్రికి లేఖ రాశాడు హసన్. దానికి ఫరీద్​ జానుపూర్​లో మంచి విద్య అందుతుందని చెప్పాడు. అక్కడే ఉండి ఆ కాలం నాటి విజ్ఞాన శాస్త్ర విషయాలన్నింటిలోనూ నిష్ణాతుడయ్యాడు. నాలుగేండ్ల తర్వాత హసన్​ ఖాన్​ జాన్​పూర్​కు వచ్చాడు. కుటుంబ మిత్రుల ద్వారా తండ్రీకొడుకులు ఏకమయ్యారు. ఫరీద్​ను సాసారం జిల్లాకు కార్యనిర్వాహకుడిగా నియమించి తానూ జాను​పూర్​లోనే స్థిరపడ్డాడు.

 కొన్నాళ్లకు ఫరీద్​ ఆ పదవిని స్వచ్ఛందంగా వదులుకుని, సోదరుడు నిజాం ఖాన్​తో కలిసి ఆగ్రాకు వెళ్లి దౌలత్ ఖాన్​ లోధీ కొలువులో చేరాడు. తండ్రి మరణం తర్వాత మళ్లీ తన పదవి పొందాడు.1526లో మొదటిసారి మొఘల్ చక్రవర్తి అయిన బాబరు కొంతమంది అనుభవజ్ఞులైన సైనికులతో టర్కీ సుశిక్షిత అశ్విక దళంతో భారతదేశాన్ని ముట్టడించాడు. 

ఇబ్రహీం లోధీని ఓడించి, సంహరించి తనను ఢిల్లీ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఫరీద్​ మొదట బహర్​ లేక బహదూర్​ ఖాన్​ లొహానీ వద్ద చేరాడు. లొహానీ మొహమ్మద్ షా అనే బిరుదుతో తనను తాను బిహార్​ రాజుగా ప్రకటించుకున్నాడు. 

ఒకసారి అతని యజమాని వేటలో పులి చేత త్రీవంగా గాయపడ్డాడు. అప్పుడు ఫరీద్​ దూసుకెళ్లి కత్తితో ఒక్క వేటు వేసి పులిని చంపాడు. దీంతో తన విశ్వాసానికి మెచ్చిన మొహమ్మద్​ షా ఆ యువ సాహసికుడికి ‘షేర్ షా’ అనే బిరుదు ఇచ్చాడు.  అప్పటినుంచి అతను ఆ పేరుతోనే కొనసాగాడు. 

షేర్​ ఖాన్​ పట్ల ఎంత అభిమానం ఉన్నా, చాడీలు చెప్పేవారి ప్రభావానికి లొంగిపోయి అతని జాగీరును తిరిరి సోదరుడు సులేమాన్​కు ఇవ్వాలని ఆజ్ఞాపించి, దాన్ని అమలు చేయడానికి సైనికులను పంపాడు. షేర్​ ఖాన్ మొదట దాన్ని ఎదిరించాడు. కానీ తర్వాత బాబరు చేత ప్రతిష్టితుడైన కార, మానికపూరు సంరక్షకుని దళాల సాయంతో మొహమ్మద్ షాను ఓడించాడు.

 తన జాగీరుతోపాటు చాలా జిల్లాలను స్వాధీనం చేసుకున్నాడు. వాటిని కొత్త చక్రవర్తి బాబరు కూడా ఒప్పుకుని అతనికి బిహార్ సైనిక ఆధిపత్యాన్ని ఇచ్చాడు. కొంతకాలం తర్వాత రాజపుటానా స్వాధీనం చేసుకున్నాడు. మధ్య భారతదేశానికి వెళ్లి అక్కడ ఆయన కలింజర్​ను ప్రతిష్టించాడు. అక్కడ రాజుకు మొదట ఆయన సులభమైన షరతులు పెట్టాడు. కానీ వాటిని తిరస్కరించడంతో చక్రవర్తి కోట ముందు భైఠాయించాడు. మొదట సాధారణ ముట్టడి 

రెండోసారి ముట్టడి కోసం సైనికులను మరింత ప్రోత్సహించాలని బాంబులు విసరమని, తాను కూడా చేతిలో బాంబు పట్టుకుని కోటపైకి ఎక్కాడు. దురదృష్టవశాత్తు ఒక బాంబు దొర్లుకుంటూ పిట్టగోడను తాకి మందుగుండు సామాగ్రి ఉన్నచోట పేలి ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కోట ఎట్టకేలకు స్వాధీనమయ్యాక ఆ చక్రవర్తి ‘అల్లాకు కృతజ్ఞతలు’ అన్నాడు. ఆ తర్వాత ఇంకెన్నడూ ఆయన కనపడలేదు. అలా షేర్​ షా సాధారణ స్థాయి నుంచి భారతదేశ సార్వభౌముని స్థాయికి అంచెలంచెలుగా ఎదిగాడు.

- మేకల మదన్​మోహన్​ రావు,కవి, రచయిత-